న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌..కొత్త రూల్స్‌

30
- Advertisement -

కొత్త సంవత్సరం వస్తోందంటే.. మ్యూజిక్‌ షోలు! టాలీవుడ్‌, బాలీవుడ్‌ నటులు, సెలబ్రిటీల హంగామా.న్యూ ఇయర్‌ అంటే పార్టీల హడావిడి. దేశవ్యాప్తంగా వేడుకలు జరిగినా.. ముంబయ్‌, ఢిల్లీ తర్వాత వినూత్నంగా జరిగేది మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీ హైదరాబాద్‌లోనే. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతు న్యూ ఇయర్‌ కు ఘనంగా వెల్‌కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు.

అయితే నూతన సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కొత్త నిబంధనలు విధించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు వేడుకలు నిర్వహించే వేడుకలు నిర్వహించే 3 స్టార్, ఆ పై స్థాయి హోటల్స్, క్లబ్స్, పబ్స్ తప్పనిసరిగా 10 రోజుల ముందు అనుమతి తీసుకోవాలని నగర సీపీ తెలిపారు.

తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని , అలాగే ఆయుధాలు, డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించవద్దని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీజే, మ్యూజిక్ సిస్టంలతోపాటు పటాకుల శబ్ధాలు 45 డిసెబుల్స్ కు మించవద్దని తేల్చి చెప్పారు. ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయం తర్వాత మద్యం సరఫరా చేయకూడదని పే, కొత్త సంవత్సరం రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి ఉంటుందని వెల్లడించారు. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10 వేలు జరిమానా లేదా దీర్ఘకాలికంగా డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -