తలనొప్పి అనేది సాధారణ సమస్య అని చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా తలనొప్పి పట్ల నిర్లక్ష్యం వహిస్తే చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామూలుగా నిద్రలేమి, పని ఒత్తిడి, అలసట వంటి కారణాల వల్ల తలనొప్పి రావడం సహజం. అలాగే జలుబు, సాధారణ జ్వరం, దగ్గు.. వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా తలనొప్పి వస్తుంటుంది. కానీ తలనొప్పిలో కూడా ప్రైమరీ తలనొప్పి, సెకండరీ తలనొప్పి అని రెండు రకాలు ఉన్నాయట. మైగ్రేన్ తలనొప్పి, ఒత్తిడిలో వచ్చే తలనొప్పి, క్లస్టర్ హెడెక్స్ వంటివి ప్రైమరీ తలనొప్పి కి సంబంధించినవిగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రకమైన తలనొప్పి ఉన్నప్పుడూ సరైన మెడిసన్ కొద్ది పతి సూచనలు పాటిస్తే దీని నుంచి బయట పడవచ్చట. .
కానీ సెకండరీ తలనొప్పి అనేది శరీరంలోని కొన్ని వ్యాధుల ప్రభావం కారణంగా ఏర్పడుతుందట. చెవుల్లో ఇన్ఫెక్షన్స్, మెదడులో ట్యూమర్స్, బీపీ ఎక్కువ కావడం, తలలో ఏమైనా బ్లీడింగ్ ఏర్పడటం వంటి ఇతరత్రా కారణాల చేత ఈ సెకండరీ తలనొప్పి ఏర్పడుతుంది. ఇక ముఖ్యంగా తలనొప్పి విషయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.
నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం, అలాగే ఉదయం నిద్ర లేవగానే భరించలేనంత తలనొప్పి ఏర్పడటం, వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా దగ్గినప్పుడు గాని, తుమ్మినప్పుడు గాని, తల కదిలించిన లేదా ముందుకి వంగినప్పుడు గాని ఎక్కువ తలనొప్పి వచ్చినప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తలనొప్పి వల్ల స్పృహ కోల్పోవడం, అధిక నీరసం, వంటి లక్షణాలు కనపడిన ప్రమాదమేనట. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ప్రమాదపు అంచున ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తలనొప్పి పట్ల జాగ్రత్తగా వహించాలి.
Also Read:ట్రెండింగ్‌లో జరగండి సాంగ్..