కండలు పెంచే ఆహార పదార్థాలు!

45
- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తినే ఆహారంపై చాలమంది అశ్రద్ద వహిస్తుంటారు. నానా రకాల తినుబండరాలు తింటూ లేని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకొందరూ సరైన పోషకాలు లేని ఆహారాన్ని తింటూ బలహీనంగా కనిపిస్తూ ఉంటారు. అయితే చాలామంది మగవారు వయసుకు తగిన బరువు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు తినే ఆహారంపై కొద్దిగా శ్రద్ద వహిస్తే శరీరానికి సమృద్దిగా పోషకాలు అందడంతో పాటు కండలు తిరిగిన దేహం సొంతమౌతుంది. మరి అలాంటి ఆహార పదార్థాలేవో తెలుసుకుందామా !

మగవారిలో కండలు పెరగాలంటే ప్రోటీన్ శాతం అధికంగా ఉన్న పదార్థాలు తినడం చాలా ముఖ్యం. కండరాలను వృద్ది చేయడంలో ప్రోటీన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. నాన్ వెజ్, బాదం, పాలు, వంటి వాటిలో ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి ఆహార డైట్ లో క్రమం తప్పకుండా ఇవి ఉండేలా చూసుకోవాలి. ఇంకా కండరాల వృద్ధిని పెంచడంలో అన్నం కూడా ఎంతగానో సహాయపడుతుంది.

అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా వాల్ నట్స్, మొలకెత్తిన విత్తనాలు, స్మూతీలు .చేపలు, గుడ్లు.. వీటన్నిటిలో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఆహార డైట్ లో చేర్చుకోవాలి. ఇంకా పాల కంటెంట్ కలిగిన పెరుగు, జున్ను వంటివి కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా బలవర్థకమైన ఆహారం తింటూనే వ్యాయామం పై దృష్టి సారించాలి. అలాగే మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఇలా సరైన ఆహార పదార్థాలు తింటూనే మానసిక రుగ్మతలకు దూరంగా ఉంటే మగవారు కండలు తిరిగిన దేహాన్ని సొంతం చేసుకోవచ్చని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.

Also Read:KTR: రాహుల్‌ జీ..అశోక్‌నగర్‌ ఎప్పుడు వస్తున్నారు?

- Advertisement -