VinodKumar:అక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు..

29
- Advertisement -

కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలోని కంటోన్మెంట్‌ భూమిని రాష్ట్రప్రభుత్వానికి అప్పగించాలిని మంత్రి కేటీఆర్‌ రాజ్‌నాథ్‌ సింగ్‌ కలిసి కోరారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా సిద్దిపేట మార్గంలో రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్‌కు చెందిన 94.20ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. తద్వారా కంటోన్మెంట్‌ భూమిని వెడల్పు చేసి జింఖానా గ్రౌండ్స్‌ నుంచి శామీర్‌పేట మధ్యలో ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు. దీంతో సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల ప్రజలు హైదరాబాద్‌కు సాఫీగా రాకపోకలు సాగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌ వినోద్‌కుమార్ అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌, వినోద్‌కుమార్, ఎంపీలు కొత్తప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక శాఖ కార్యదర్శి హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింంద్‌ కుమార్‌తో వెళ్లి కలిసి ఐదు జిల్లాల ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను వివరించినట్టు తెలిపారు.

శామీర్ పేట నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకు ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు హకీంపేట – బొల్లారం – అల్వాల్ – తిరుమలగిరి – కార్ఖానా – జింఖానా గ్రౌండ్ మధ్యలో కంటోన్మెంట్ స్థలంలో రోడ్డును వెడల్పు చేసి ఫ్లై ఓవర్ ( స్కై వే ) బ్రిడ్జిని నిర్మించాలని సీఎం కేసీఆర్‌ సుముఖంగా ఉన్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలిపారు. ఐదు జిల్లా నుంచి హైదరాబాద్ శివారు వరకు ప్రయాణానికి పట్టే సమయం ఒక ఎత్తు అయితే… శామీర్ పేట శివారు నుంచి హైదరాబాద్ నగరంలోకి చేరుకునే సమయం మరో ఎత్తుగా ఉంటుందని వినోద్ కుమార్ కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ ఐదు జిల్లాల ప్రజలు ట్రాఫిక్ సమస్యను అధిగమించి సులువుగా హైదరాబాద్ చేరుకునేందుకు శామీర్ పేట – హకీంపేట – బొల్లారం – అల్వాల్ – కార్ఖానా – తిరుమలగిరి – జింఖానా గ్రౌండ్స్ మధ్య ఫ్లై ఓవర్ ( స్కై వే ) నిర్మాణం ఒక్కటే పరిష్కార మార్గం అని వినోద్ కుమార్ అన్నారు.

Also Read: ఈటెల, కోమటిరెడ్డిపై.. కాషాయపార్టీకి నమ్మకం లేదా ?

 హైదరాబాద్ నగరం నుంచి వరంగల్ జిల్లాకు వెళ్ళే దారిలో అంబర్ పేట, 6నంబర్ జంక్షన్ నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని అలాగే మెహిదీపట్నం నుంచి ఎయిర్ పోర్ట్ సహా మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లేందుకు పీ.వీ. నర్సింహా రావు ఎక్స్ ప్రెస్ వే ఉందన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లేందుకు ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని తెలిపారు, కానీ కేవలం సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలు ట్రాఫిక్ నుంచి బయట పడి ప్రయాణం సాఫీగా కొనసాగించేందుకు మాత్రం ప్రత్యేకంగా మరో దారి లేదని దీనికి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఒక్కటే పరిష్కారం అని వినోద్ కుమార్ కేంద్ర రక్షణ మంత్రికి రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించారు.

Also Read: కాంగ్రెస్ కు మరో దెబ్బ.. ఆ ఇద్దరు గుడ్ బై ?

- Advertisement -