‘దేవ‌ర’ కీల‌క షెడ్యూల్ పూర్తి

31
- Advertisement -

ఎన్టీఆర్, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న దేవ‌ర సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం మొద‌లైన నాలుగో షెడ్యూల్ స‌క్సెస్‌ ఫుల్‌ గా పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. తార‌క్, సైఫ్, మిగిలిన కీల‌క న‌టులంద‌రూ పాల్గొన్న ఈ షెడ్యూల్‌లో భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను పూర్తి చేశారు. ఇక తర్వాత షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ – కొరటాల సిద్ధం అవుతున్నారు. పైగా ఈ ఐదో షెడ్యూల్ మొత్తం 23 రోజుల పాటు సాగనుంది.

అన్నట్టు ఈ ఐదో షెడ్యూల్ ను వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్ కూడా పాల్గొననుంది. వీరిద్దరి పై ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ తో పాటు ఎన్టీఆర్ – జగపతి బాబు పై కొన్ని ఎమోషనల్ సీన్స్ ను కూడా షూట్ చేస్తారట. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో జరగనుంది. కొరటాల శివ కథకే కాదు, కథ జరిగే నేపథ్యానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు.

Also Read: లక్ష కోట్ల మెగా ప్రిన్సెస్ డిశ్చార్జ్

ఈ సముద్రం నేపథ్యంలో వచ్చే విజువల్స్ అదిరిపోతాయట. ఈ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న విడుదల చేయనున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ అంతర్జాతీయ మూవీని కొరటాల శివ కసితో తెరకెక్కిస్తున్నాడు. వరుస స‌క్సెస్‌ ల‌తో జోష్ మీదున్న ఎన్టీఆర్ కి కొర‌టాల దేవ‌రతో ఏ రేంజ్ హిట్ ను ఇస్తాడో చూడాలి. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

Also Read: #BoyapatiRAPO…సెప్టెంబర్ 15న విడుదల

- Advertisement -