ఈటెల, కోమటిరెడ్డిపై.. కాషాయపార్టీకి నమ్మకం లేదా ?

55
- Advertisement -

తెలంగాణ బీజేపీలో ఈటెల రాజేంద్ర మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ హాట్ చర్చలకు కారణం అవుతున్నారు. ఈ ఇద్దరు నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందనే వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాము పార్టీ మారడం లేదని తాము బీజేపీతోనే ఉంటామని ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే పలు మార్లు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికి వీరిద్దరి పార్టీ మార్పుపై రూమర్స్ గుప్పుమంటూనే ఉన్నాయి. ఇక ఇటీవల బీజేపీ స్టార్ట్ చేసిన ” ఇంటింటికి బీజేపీ ” కార్యక్రమంలో కూడా ఈటెల రాజేందర్ మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొనలేదు.

దీంతో బీజేపీ అధిష్టానం వీరిద్దరిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వీరిద్దరు ఎప్పుడైనా బీజేపీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని అధిష్టానం కూడా భావిస్తున్నాట్లు ఉంది. అందుకే వీరిద్దరికీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందట. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై గల కారణాలను డిల్లీ పెద్దలు అడిగి తెలుసుకొనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే డిల్లీ పెద్దలు ఈటెల రాజేంద్రతో పలు మార్లు భేటీ అవుతూనే వస్తున్నాయి. భేటీకి సంబంధించి స్పష్టమైన కారణాలు బహిర్గతం కానప్పటికి, ఈటెల రాజేంద్ర పార్టీ మరెందుకు సిద్దంగా ఉన్నందుకే ఆయనను బుజ్జగించేందుకు బీజేపీ అధిష్టానం తరచూ ఈటెలతో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: కాంగ్రెస్ కు మరో దెబ్బ.. ఆ ఇద్దరు గుడ్ బై ?

ఇక అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ గూటికి చేరి చాలా రోజులౌతున్నప్పటికి ఆయనకు ఇంతవరకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. దాంతో కోమటిరెడ్డి తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నాట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడిని తిరిగి హస్తం పార్టీలోకి తీసుకొచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. అందువల్ల ఈటెల రాజేంద్ర మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో కొనసాగుతారా లేదా అనే దానిపై ఆ పార్టీ అధిష్టానానికి కూడా నమ్మకం లేనట్లే కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి దారి ఎటు వైపు ఉంటుందో చూడాలి.

Also Read: KTR:అభివృద్ధి కోసం కేంద్రం సహకరించాలి

- Advertisement -