అప్పుడు ఆమెకు 17, భర్తకు 7 ఏళ్లు

37
- Advertisement -

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన గ్లామర్‌ ట్రీట్‌తోనే కాదు, తన బోల్డ్ కామెంట్స్ తో కూడా ఎప్పటికప్పుడు కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది. తాజాగా తన భర్త వయసు గురించి బోల్డ్ గా మాట్లాడి సోషల్‌ మీడియాలో అభిమానులను అలరించింది. ప్రియాంకా చోప్రా తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైన నిక్‌ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి పై ఎన్నో మీమ్స్ వచ్చాయి. ప్రియాంక మోడల్ గా ఎంట్రీ ఇచ్చే నాటికి, నిక్‌ తన తల్లి ఒళ్ళో ఉన్నట్టు కూడా మీమ్ చేసి వదిలారు. ఈ మీమ్ అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు తన మొగుడు వయసు పై స్వయంగా ప్రియాంక చోప్రానే ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది.

ప్రియాంక చోప్రా 2000లో మిస్ వరల్డ్ టైటిల్ ను గెలుచుకుంది. అప్పుడు ప్రియాంక చోప్రా వయసు 17 ఏళ్లు. మరి ఆమె ప్రస్తుతం మొగుడు వయసు ఎంతో తెలుసా ?, ఇదే విషయాన్ని చెప్పింది ప్రియాంక చోప్రా. ‘‘2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో నేను టైటిల్ ను గెలిచాను. అయితే, ఆ పోటీలను మా మావయ్య, అత్తయ్య టీవీలో చూశారట. నేను టైటిల్‌ గెలుపొందిన క్షణాలు తనకింకా గుర్తేనని మా అత్తయ్య నాతో ఎమోషనల్ అవుతూ చెప్పడం నన్ను కదిలించింది, అప్పుడు నిక్‌ వయసు ఏడేళ్లట అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.

Also Read: పవన్ దెబ్బకి యుట్యూబ్ బద్దలైపోయింది

ప్రియాంక చోప్రా ఇంకా మాట్లాడుతూ.. ‘కాలం మా ఇద్దర్నీ కలిపింది. మేము కలవాలని రాసిపెట్టి ఉంది. వయసు పరంగా మా ఇద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ మేం ప్రేమించుకున్నాం. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం’’ అని ప్రియాంకా చోప్రా చెప్పింది. ఏమిటో ప్రియాంక చోప్రా. తాను మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుపొందినప్పుడు నిక్‌ జోనస్‌కు ఏడేళ్లని చాలా ఓపెన్ గా చెప్పేసింది. దీంతో నెటిజన్లు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.

Also Read: పెళ్లిళ్ల పై దీపికా షాకింగ్ కామెంట్స్

- Advertisement -