నిర్మాత సురేష్ బాబు బాబాయ్ ఇంట్లో చోరి

474
suresh babu
- Advertisement -

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు బాబాయ్ రామ్మోహన్ రావు ఇంట్లో చోరి జరిగింది. ప్రకాశం జిల్లా కారంచేడులోని రామ్మోహన్ రావు ఇంట్లో దొంగలు నగలు, నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న అనంతరం క్లూస్ టీంతో ముమ్మరంగా తనిఖిలు నిర్వహించారు పోలీసులు. ఇంటి ఆవరణలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ఇంకా ఎంత మొత్తంలో నగదు, నగలు పోయాయి అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. రామ్మోహన్ రావు దివంగత దగ్గుబాటి రామానాయుడికి తమ్ముడు అవుతారు.

- Advertisement -