‘అశ్వత్థామ’ టీజర్‌కు అద్భుత స్పందన..!

368
Naga Shaurya

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘అశ్వత్థామ’. రమణతేజ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ కనిపించనుంది. ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. నిజ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం జనవరి 31న విడుదలవుతుంది.

ఇక టీజర్‌ విషయానికొస్తే.. “ఎలా వుంటాడో కూడా తెలియని ఒక రాక్షసుడు.. వాడికి మాత్రమే తెలిసిన ఒక రహస్యం.. వాడి కింద పనిచేసే సైన్యం.. గమ్యం తెలియని ఒక యుద్ధం.. ఆ యుద్ధం గెలవాలంటే ఒక ఆరడుగుల నారాయణాస్త్రం కావాలి” అంటూ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ మొదలవుతోంది.

టీజర్‌లో యాక్షన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. నాగశౌర్యకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలపై ఈ టీజర్‌ను కట్ చేశారు. రఫ్ లుక్‌తో నాగశౌర్య కనిపిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. పవర్ ఫుల్ డైలాగ్స్‌తో `అశ్వథ్థామ` టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకుంటోంది. ఈ చిత్రానకి ఉషా ముల్పూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.