ఖైరతాబాద్ గణేష్..శోభాయాత్ర

4
- Advertisement -

జంటనగరాల్లో వినాయక నిమజ్జనం సందడి నెలకొంది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలగా పాతబస్తీ సహా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం వేడుకల సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఇక అంతా ఎదురుచూస్తున్న ఖైరతాబాద్‌ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ఉదయమే ప్రారంభమైంది. భారీ క్రేన్ సహాయంతో ఈ 70 అడుగుల మహా విగ్రహాన్ని ట్రాలీపైకి చేర్చారు. అనంతరం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.

మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 గంటల మధ్య మహాగణపతి నిమజ్జనం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన క్రేన్ నంబర్ 4 వద్ద ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం కావడంతో తెల్లవారు జాము నుంచే తండోపతండాలుగా ఖైరతాబాద్‌కు చేరుకున్నారు భక్తులు. రోడ్లన్నీ గణేశ్ శోభాయాత్రతో సందడిగా మారాయి.

Also Read:KTR: చిట్టినాయుడు(రేవంత్) సుభాషితాలు!

- Advertisement -