Harishrao:దశాబ్ది ఉత్సవాల ప్రణాళిక ఖరారు

44
- Advertisement -

జూన్‌ 2నుంచి ప్రారంభమయ్యే దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సిహెచ్‌ మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎస్‌ నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, గంగుల కమలాకర్‌, డా.వి శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యవతి రాథోడ్‌ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… గత 9ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ నిర్దేశించిన రోజున ఉత్సవాలు నిర్వహించాలని దానికి తగిన కార్యచరణ ప్రణాళికలు రూపొందించాలని అదికారులకు ఆదేశించారు. రాష్ట్రం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ ఉత్సవాలలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా మాత్రమే ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించవచ్చని తెలిపారు.

Also Read: Errabelli:ద‌శాబ్ధి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్ష‌

హైదరాబాద్‌లో జూన్‌ 2న నిర్వహించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారని జిల్లా కేంద్రంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రాలను సీఎస్‌ శాంతి కుమారి మంత్రులకు తెలియ జేశారు. ఆయా శాఖలు సాధించిన విజయాలను సంగ్రహించేలా ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ప్రతిపాదనలు సూచనలపై చర్చించి తదుపరి సూచనల కోసం సీఎంకి సమర్పించనున్నట్టు తెలిపారు.

Also Read: CMKCR:దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ చేసింది శూన్యం

- Advertisement -