డేంజర్.. ఇలా అసలు తినకండి !

38
- Advertisement -

ఆరోగ్యంగా ఉండేందుకు ఫలాలను ఎక్కువగా తినమని వైద్యులు మరియు ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ప్రకృతి ప్రసాదించే పండ్లలో మన శరీర ఆరోగ్యానికి ఉపయోగ పడే ఎన్నో రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడిన, మనం తినే ఆహారంతో పాటు ఆయా రకాల పండ్లను తినమని చెబుతుంటారు వైద్యులు. ఇకపోతే.. అరటి, జామ, ఫైనాఫిల్, సపోటా, నారింజ, యాపిల్, మామిడి.. ఎలా ఎన్నో రకాల పండ్లు మార్కెట్లోనూ లేదా తోటల్లోనూ లభిస్తూ ఉంటాయి. ఇక ప్రతి రకమైన పండు నిర్ధిష్ట పోషకాల సమ్మేళనంగా ఉంటుంది. కాబట్టి ఏ రకమైన పండు తిన్న ఎలాంటి సమస్య ఉండదు. .

కానీ ఒక పండుతో పాటు మరో పండు గాని లేదా వేరే ఆహార పదార్థం కానీ జత చేసి తింటూ ఉంటారు కొందరు. అయితే ఈ రకంగా తినడం వల్ల అన్నీ సందర్భాల్లో సమస్యలు రావు గాని కొన్నిసార్లు కచ్చితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. నారింజ పండు గురించి మనందరికి విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అయితే ఈ పండును క్యారెట్ తో పాటు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయట. ఎందుకంటే క్యారెట్ లో బయోటిన్ ఉంటుంది.

అందువల్ల నారింజ పండుతో కలిపి తిన్నప్పుడు గుండెల్లో మంట, మూత్ర పిండాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక బొప్పాయి నిమ్మకాయ రెండు కూడా కలిపి తినకూడదట. ఈ రెండు కలిపి తినడం వల్ల రక్త హీనత వంటి సమస్యల బారిన పడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రతిరోజూ పాలు తాగే అలవాటు ఉంటుంది చాలామందికి.. అయితే తాగినప్పుడు నారింజ పండు తినద్దట. ఇలా తినడం వల్ల జీర్ణ సంబందిత సమస్యలు ఏర్పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక అరటిపండు అలాగే జామపండు కూడా కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల గ్యాస్, వికారం వంటి సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read: అరటిపండు తినే వాళ్ళు.. జాగ్రత్త !

- Advertisement -