ఏపీ గవర్నర్‌గా అబ్దుల్ నజీర్..

23
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా రిటైర్డ్ సుప్రింకోర్టు న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ప్రస్తుత ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియామకం అయ్యారు. ఏపీ సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోద ముద్ర వేశారు. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌ రాధా కృష్ణన్ మాథుర్ రాజీనామాలకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్

సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య.

జార్ఖండ్‌ గవర్నర్‌గా సి.పి రాధాకృష్ణన్‌.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా.

అసోం గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్… ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియామకం.

ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనుసూయా ఉక్యే, మణిపూర్ గవర్నర్‌గా నియామకం.

మణిపూర్ గవర్నర్ గణేశన్, నాగాలాండ్ గవర్నర్‌గా నియామకం.

బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్, మేఘాలయ గవర్నర్‌గా నియామకం.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్… బీహార్ గవర్నర్‌గా నియామకం.

జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ మహారాష్ట్ర గవర్నర్‌గా నియామకం.

బ్రిగ్. (డా.) బి.డి. మిశ్రా (రిటైర్డ్), అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియామకం అయ్యారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -