సాంగ్ ఘాట్ లో ‘భోళా శంకర్’

40
- Advertisement -

వాల్తేరు వీరయ్య తో ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచి భారీ వసూళ్లు కొల్లగొట్టిన మెగా స్టార్ చిరు ఇప్పుడు భోళా శంకర్ సెట్స్ లో సందడి చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి చకచకా షూటింగ్ జరుగుతుంది. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తమిళ్ సినిమా వేదళం కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి సాంగ్ ఘాట్ చేస్తున్నారు.

మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన సాంగ్ ఘాట్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సాంగ్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఈ సాంగ్ షూటింగ్ విషయం సోషల్ మీడియా లో లీక్ అవ్వగానే మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ సాంగ్ ఎలా ఉండబోతుందా ? అంటూ మెగా ఫ్యాన్స్ ఇప్పటికే ఆరా తీస్తున్నారు. మరి స్వర సాగర్ తనకొచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్ ను ఎలా ఉపయోగించుకున్నాడో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -