2022… గూగుల్ శోధించిన వ్యక్తులు

410
- Advertisement -

మరికొన్ని గంటల్లో పాత సంవత్సరంకు ముగింపు పలికి కొత్త సంవత్సరంకు ఆహ్వానం పలికే సమయం ఆసన్నమైంది. అయితే ప్రస్తుత సంవత్సర కాలంలో మోస్ట్‌ సెర్చ్‌ పర్సన్‌ ఎవరో మీకు తెలుసా…వారు ఏకారణంచేతనైనా సరే మీరు వారిని గూగుల్ ఇంజిన్ ద్వారా సెర్చ్‌ చేశారు. అయితే మీరు సెర్చ్ చేసిన లిస్టులో ఈ పేర్లు ఉన్నాయా లేకుంటే మీరు తెలుసుకోండి. అన్నట్టు ఇది సంవత్సర మొత్తంలో టాప్ లిస్ట్‌ కాదు. సంవత్సరంలో వెతికిన పేర్లను నెలకు సగటుగా వెతికిన వ్యక్తుల జాబితా.

అంబర్ హర్డ్‌
జాన్ డెప్‌పై వివాదాస్పద వ్యాజ్యం వేసిన తర్వాత బాగా పాపులారీటి సంపాదించుకుంది. ఈమెను సగటున నెలకు 56,51,700 సార్లు శోధించారు. అంబర్‌ 2022వ సంవత్సరానికిగాను ప్రథమ స్థానంలో ఉంది.

జాన్ డెప్
కరీబియన్ పైరేటీస్ సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను సంపాదించుకున్న డెప్. ఈజాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. అంబర్‌ హర్డ్‌ పై న్యాయవివాదంలో చిక్కుకున్న డెప్… 56,56,100సార్లు శోధించారు.

క్వీన్ ఎలిజబెత్‌2
ఇంగ్లాండ్ మరియు కామన్‌వేల్త్‌ దేశాలధినేత ఆకాల మరణంతో ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. క్వీన్ ఎలిజబెత్‌ను గూగుల్‌ ఇంజిన్‌ ద్వారా 4294300సార్లు శోధించారు.

టామ్ బ్రాడీ
టామ్ బ్రాడీని 40,61,900 సార్లు గూగుల్‌లో శోధించారు. ఇతను ఒక అథ్లెట్‌.

కిమ్‌ కర్డాషియాన్
గూగుల్‌లో సగటున నెలకు 34,79,700సార్లు శోధించారు. ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతున్నారు.

పీట్ డేవిడ్సన్‌
కిమ్‌ కర్డాషియన్ బాయ్‌ఫ్రేండ్‌ అయిన పీట్ గూగుల్‌ ద్వారా 32,91,000 సార్లు గూగుల్‌లో శోధించారు. ఇతను 6వ స్థానంలో కొనసాగుతున్నారు.

ఎలన్‌ మస్క్‌
ఎలన్ మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు చేసినప్పటి నుండి నిత్యం వార్తల్లో ఉన్నారు. ఇతన్ని 31,93,000 సార్లు గూగుల్‌ వేదికగా సెర్చ్‌ చేశారు. వివాదస్పదమయ్యే విధంగా తీసుకున్న నిర్ణయాల వల్ల మస్క్‌ 7వ స్థానంలో కొనసాగుతున్నారు.

విల్ స్మిత్
విల్‌స్మిత్ ఈ యేడాది ఆరంభంలో కో యాక్టర్‌ను చెంపదెబ్బ కొట్టినప్పటి నుంచి నిత్యం గూగుల్‌ కనిపించారు. ఇతన్ని 31,55,900 సార్లు వెతికారు. దీంతో 8వ స్థానంలో ఉన్నారు.

మిల్లీ బాబీ బ్రౌన్ 
మిల్లీ బాబీ బ్రౌన్ చాలా ప్రజాదరణ పోందిన వ్యక్తిగా రికార్డులు సృష్టించింది. ఈమె 27,82,600సార్లు గూగుల్‌లో శోధించబడ్డ వ్యక్తిగా నిలిచింది.

జెండయా
జెండయా స్పైడర్‌మ్యాన్‌ సినిమాతో ప్రపంచంను ఆకర్షించిన వ్యక్తిగా నిలిచింది. ఈమె సగటున 2718300సార్లు గూగుల్‌ వెతికారు.

లేబ్రోన్ జేమ్స్
లేబ్రోన్ జేమ్స్‌ టామ్‌ బ్రాడీ తర్వాత అత్యంత మంది శోధించిన అథ్లెట్‌గా నిలిచారు. ఇతను 23,49,000సార్లు గూగుల్‌ వేదికగా వెతికారు.

స్టీఫెన్ కర్రీ
ఇతనొక ఎన్‌బీఏ ఆటగాడు. గూగుల్‌ ఇతన్ని 21,80,900 సార్లు వెతికి పెట్టింది. దీంతో స్టీఫెన్ కర్రీ పన్నెండవ స్థానంలో ఉన్నాడు.

టేలర్ స్విఫ్ట్‌
టేలర్ పాప్ గాయకురాలు, ఇంగ్లీష్ జానపద రాణిగా అభివర్ణిస్తారు. ఈమెను నెలకు సగటున 20,99,300సార్లు గూగుల్‌లో వెతికారు.

హ్యారి స్టైల్స్‌
హ్యారి స్టైల్స్‌ హలీవుడ్‌ నటుడేగాక మంచి సింగర్‌ కూడా. ఇతన్ని సగటున నెలకు గూగుల్‌లో వెతికిన వాళ్లు 20,99,300…14వస్థానంలో ఉన్నారు.

ర్యాన్ రేనాల్డ్స్‌
ర్యాన్‌ ఒక ఎక్స్‌ మాన్‌ గా సుపరిచితుడు. ఇతను ఒక నటుడు, పోలీస్, బిజినెస్‌ పర్సన్‌, ఫుట్‌బాల్ ఆటగాడు, డైరెక్టర్‌ కూడా పనిచేశారు. మల్టీపుల్‌ టాలెంటెడ్‌ పర్సన్‌గా ర్యాన్‌ రేనాల్డ్స్‌ను గూగుల్‌లో 20,78,900 సార్లు వెతికారు.

ఇవి కూడా చదవండి…

పిక్ టాక్ : బికినీలో అందాల అరాచకం

ఆ భామ పై కొరటాల చూపు

ధమాకా బ్లాక్ బస్టర్ హిట్‌..

- Advertisement -