అండర్ గ్రౌండ్ మెట్రోలో మోడీ

17
- Advertisement -

అండర్ గ్రౌండ్ మెట్రోలో ప్రయాణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతా లో నిర్మించిన దేశంలో మొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని ప్రారంభించారు మోడీ. ఈ అండర్‌ వాటర్‌ మెట్రో టన్నెల్‌ ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి ప్రయాణించారు ప్రధాని.

హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న న‌ది కింద ఈ ట‌న్నెల్ నిర్మించారు. రూ.120 కోట్ల వ్యయంతో 16.6 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ మార్గం కోల్‌కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్‌ లేక్‌లను కలుపుతుంది. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉండగా అందులో మూడు భూగర్భంలోనే ఉన్నాయి.

Also Read:ట్రంప్ పై నిక్కి మరో గెలుపు

- Advertisement -