ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ రమ్‌గా నిలిచిన ఓల్డ్ మాంక్ సృష్టికర్త కపిల్ మోహన్ గుండెపోటుతో మరణించారు. ఘజియాబాద్‌లోని ఆయన నివాసంలో ఈనెల 6న కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే మోహన్ మేకిన్ లిమిటెడ్ పేరుతో ఓల్డ్ మాంక్ రమ్ సంస్థను ఆయన నెలకొల్పారు. ఓల్డ్ మాంక్‌తో పాటు సోలా నెం.1, గోల్డెన్ ఈగల్ వంటి మరో రెండు బ్రాండులను కూడా ఆయన సృష్టించారు.
మద్యాని తయారు చేసిన ఇయనకు మద్యం అలవాటు లేదు. 1954లో మొదటిసారి ఆయన వనిలా ఫ్లేవర్‌తో ఓల్డ్ మంక్ రమ్‌ను లాంచ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రమ్ చాన్నాళ్లు అత్యధికంగా అమ్ముడుపోయింది. ఈయన కృషికి గాను పద్మశ్రీ అవార్డునిచ్చి ప్రభుత్వం సత్కరించింది. కపిల మోహన్ మృతి పట్ల ఓల్డ్ మంక్ ప్రియులు, సోషల్ మీడియా యూజర్లు నివాళి అర్పించారు.