కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌డం లేదుః కేటీఆర్

272
ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఏమాత్రం స‌హ‌క‌రిండం లేద‌న్నారు ఎమ్మెల్యే టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..ఓవైపు మిషన్ కాకతీయ, మిషన్ భ‌గీరథ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ప్ర‌సంశీస్తూనే మ‌రోవైపుఏ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వ‌డంలేద‌ని మండిప‌డ్డారు. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ అద్భుతం అని ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా ప్ర‌శంసించింద‌ని ఈసందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణలో బీజేపీ ఉనికి లేదనే ఈ విధంగా చేస్తున్నారని చెప్పారు.

ఇటివ‌లే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి 103 స్ధానాల్లో డిపాజిట్ కూడా రాలేద‌న్నారు. బీజేపీ త‌న తీరును మార్చుకోక‌పోతే పార్లమెంట్ ఎన్నిక‌ల్లో కూడా ఇదే రిపీట్ అవుతుంద‌న్నారు. 2014 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఒక సికింద్ర‌బాద్ పార్ల‌మెంట్ స్ధానం మాత్ర‌మే గెలిచింద‌ని ఈసారి అది కూడా గెల‌వ‌డం క‌ష్టం అని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్ర ప్ర‌భుత్వం త‌మ‌కు నిధులు మంజూరు చేయ‌డం లేద‌న్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల ఒక రీతిలో… బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల పట్ల మరో రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు.

- Advertisement -