మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత కధ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈమూవీకి ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈచిత్రంపై అనేక వివాదాలు నెలకొనడంతో సంచలనం అయ్యింది. జనవరి 18న చిత్రాన్ని విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. ఈసందర్భంగా మూవీ ప్రమోషన్స్ చకాచకా జరుపుతున్నారు. ఈమూవీని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. తాజాగా ఈచిత్రం తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.
మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటించగా..సోనియా గాంధీగా సజ్జన్ బెర్నర్ట్ , రాహుల్ గాంధీగా అర్జున్ మాథూర్, ప్రియాంక గాంధీగా ఆహానా కుమ్రా నటించారు. విజయ్ రత్నాకర్ గుత్త డైరెక్టర్ తెరకెక్కిన ఈ చిత్రానికి సలీమ్-సలైమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
https://youtu.be/HnTxGHGmUiU