పాండ్యా వ్యాఖ్యలపై స్పందించిన కోహ్లీ..

141
kohli

టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా,కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలతో భారత జట్టుకు సంబంధంలేదని తెలిపారు కెప్టెన్ విరాట్ కోహ్లీ. వారు చేసిన వ్యాఖ్యలను టీమిండియా ఎట్టి పరిస్థితుల్లో సమర్థించదని చెప్పారు. ఓ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు బాధ్యతతో మెలగాలన్నారు.

ఎవరైన వారి వ్యక్తిగత వ్యాఖ్యలను జట్టుకు ఆపాదించడం సరికాదన్నారు. ఈ వివాదం జట్టుపై, తమ ఆటతీరుపై ఎటువంటి ప్రభావం చూపబోదని విశ్వాసం వ్యక్తం చేశాడు.తాజా పరిణామాలు డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణంపై ఎటువంటి ప్రభావం చూపబోవన్నాడు విరాట్.

మరోవైపు పాండ్యా, రాహుల్‌లపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ఇద్దరిని సస్పెండ్ చేయవచ్చని కమిటీ
ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ)కు బీసీసీఐ లీగల్ సెల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీసీఐ రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు లీగల్ సెల్ చెప్పింది.