- Advertisement -
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ఈ నగరానికి ఏమైంది చిత్ర స్పెషల్ షోలో వీరిద్దరూ కలిశారు. ఇద్దరు దర్శకులు “ఈ నగరానికి ఏమైంది” “సంజు” చిత్రాల గురించి ముచ్చటించుకోవడం జరిగింది. తరుణ్ భాస్కర్ తన ఐడియాస్ ను డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో షేర్ చేసుకున్నారు.
రాజ్ కుమార్ హిరాణి, తరుణ్ భాస్కర్ తీసిన చిత్రాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. “సంజు” చిత్రం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. సినిమా విడుదలైన అన్ని ఏరియాలనుండి మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాక భారి వసూళ్లను రాబడుతోంది. “ఈ నగరానికి ఏమైంది” సినిమా నలుగురు స్నేహితులు గోవాలో షార్ట్ ఫిలిం చెయ్యడానికి పొందిన అనుభూతులతో తెరకెక్కించబడింది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా మంచి విజయం సాధించింది.
- Advertisement -