కేసీఆర్ కిట్ అద్భుతం- మంత్రి కేటీఆర్‌

135
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళా సంక్షేమం, భద్రత మరియు సాధికారత విషయంలో తెలంగాణ అద్వితీయ ప్రగతి సాధించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మహిళా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన పథకం కేసీఆర్ కిట్‌. తెలంగాణలో కేసీఆర్ కిట్ లబ్ధిదారుల సంఖ్య 13,30,000 మందికి చేరుకోవడం గర్వించదగ్గ విషయం అని కేటీఆర్‌ పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో జాతీయ మహిళా దినోత్సవం రానుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఈమేరకు ఆయన ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు.

16 రకాల వస్తువులతో కూడుకున్న కేసీఆర్ కిట్ తో పాటు ఆడ బిడ్డ పుడితే రూ. 13000, మగ బిడ్డ పుడితే రూ. 12000 ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. ప్రసవం అనంతరం తల్లీ బిడ్డలను క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లడానికి అమ్మ ఒడి పేరుతో 300 వాహనాలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం అద్భుతమైన ఫలితాలు అందించింది తెలిపారు.

-సంస్థాగత ప్రసవాలు 22% పెరిగాయి (2014 – 30% నుండి 2021- 52% వరకు) ఇది దేశంలోనే అత్యధికం.
-MMR (మాతృ మరణాల రేటు) 92 నుండి 63కి తగ్గింది (జాతీయ సగటు 113).
-IMR (శిశు మరణాల రేటు) 39 నుండి 23కి తగ్గింది (జాతీయ సగటు 42).

- Advertisement -