తొలి టెస్టులో భారత్‌ గెలుపు.. 1-0తో ఆధిక్యం..

185
- Advertisement -

మొహాలీ టెస్టులో శ్రీలంకపై భారత జట్టు భారీ విజయం సాధించింది. రవీంద్ర జడేజా అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ రాణించిన వేళ…లంకపై టీమిండియా అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం చాటుకుంది. మొహాళీలో మూడో రోజే ముగిసిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో తిరుగులేని గెలుపు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. రవీంద్ర జడేజా (175 నాటౌట్), రిషభ్ పంత్ (96), రవిచంద్రన్ అశ్విన్ (61), హనుమ విహరి (58), విరాట్ కోహ్లీ (45) రాణించడంతో 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.

బ్యాటింగ్‌కు దిగిన లంకను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్సులో లంక జట్టు 174 పరుగులకే ఆలౌట్ అయి ఫాలో ఆన్‌లో పడింది. ఫాలో ఆన్‌లో కూడా జడేజా 4, అశ్విన్ 4 వికెట్లతో చెలరేగారు. వీరికి మహమ్మద్ షమీ 2 వికెట్లతో జత కలిశాడు.

భారత బౌలర్లను లంక బ్యాటర్లు ఏమాత్రం ఎదుర్కోలేకపోయారు. నిరోషన్ డిక్కవెల్ల (51 నాటౌట్) మాత్రమే ఫర్వాదలేదనిపించాడు. మిగతా వాల్లంతా 30 పరుగుల లోపు స్కోర్లకే పెవిలియన్ చేరడంతో రెండో ఇన్నింగ్సులో శ్రీలంక 178 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం నమోదు చేసింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

- Advertisement -