మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `వినయవిధేయరామ`. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మించిన భారీ చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద సత్తా చాటింది. సంక్రాంతి రేసులో మంచి కలెక్షన్స్ తో రాణిస్తున్న ఈ సినిమా గురించి…డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ – “మెగాపవర్‌స్టార్ చిత్రం అదీ కూడా బోయపాటి శ్రీనుగారి దర్శకత్వంలో అని తెలియగానే సినిమాపై భారీ అంచనాలుంటాయనే సంగతి తెలిసిందే. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించాం.
అలాగే హీరోను మాస్ యాంగిల్‌లో దర్శకుడు బోయపాటి శ్రీనుగారు ప్రజెంట్ చేశారు. అన్నదమ్ములు మధ్య అనుబంధం, ఫ్యామిలీ ఎమోషన్స్ కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే పవర్‌ఫుల్ యాక్షన్ ఏపిసోడ్స్, డ్యాన్సులకు మాస్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. సినిమా సక్సెస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్“ అన్నారు.