ప్రొటెం స్పీక‌ర్ గా ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రమాణం

159
mumtazahmedkhan

రేప‌టి నుంచి తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభంకానున్న సంగ‌తి తెలిసిందే. ఈసంద‌ర్భంగా నేడు ప్రొటెం స్పీక‌ర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మ‌ద్ ఖాన్ చేత గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

cmkcr

ప్రమాణస్వీకారం అనంతరం ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ను గవర్నర్ నరసింహన్, సిఎం కెసిఆర్ లతో పాటు మాజీ స్పీకర్ పుష్పాగుచ్చాలతో అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ముందు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి రేపు గన్ పార్కు వద్ద అమరులకు నివాళులర్పించనున్నారు. రేప‌టి నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి.