బోయపాటి – బాలయ్య..అప్‌డేట్!

12
- Advertisement -

టాలీవుడ్ హిట్ సినిమాల్లో ఒక జోడి నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీనివాస్. వీరిద్దరి కాంబోలో మళ్లీ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇక అఖండ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత బాలయ్య తన 109వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇది అఖండకు సీక్వెల్‌గా ఉంటుందా లేదా కొత్త కథతో వస్తారన్న సస్పెన్స్‌కు మాత్రం తెరపడటం లేదు. ఈ నెల 25న సినిమా కథపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీ టౌన్‌లో చర్చ జరుగుతోంది. 25న సినిమాకు సంబంధించిన అప్‌డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్… గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బాలయ్యతో మూవీ పట్టాలెక్కనుంది.

Also Read:Modi:రష్యాకు అండగా ఉంటాం

- Advertisement -