ఇండియా ఆత్మను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు

394
Kejriwal Prashanth
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తుంది. మొత్తం 70 అసెంబ్లీ స్ధానాలుండగా 50కి పైగా స్ధానాల్లో ఆమ్ ఆద్మీ విజయం సాధించింది. బీజేపీ 20 స్ధానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. వరుసగా మూడో సారి కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇండియా ఆత్మను గెలిపించారని ఆయన ట్వీట్ చేశారు. ఇండియా ఆత్మను రక్షించుకునేందుకు అండగా నిలిచిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రచార వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్.

Pk Tweet

- Advertisement -