‘రంగస్థలం’పై తమన్‌ కామెంట్‌..!

185
Thaman Comments on Ram Charan Rangasthalam Movie
- Advertisement -

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’.ఈ సినిమాని సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా సెట్‌కు వెళ్లిన సంగీత దర్శకుడు తమన్‌ సుకుమార్‌ బృందం తీస్తున్న ఓ చక్కటి చిత్రమిదని చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతం అందించినట్లు తెలిసిందని పేర్కొన్నారు. సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు పనితనాన్ని కూడా ప్రశంసించారు. రామ్‌చరణ్‌ చేస్తున్న నిజమైన ప్రయత్నం ఈ సినిమా అని తమన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Thaman Comments on Ram Charan Rangasthalam Movie

దీంతోపాటు చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన స్టిల్‌ను ఆయన పంచుకున్నారు. ఈ స్టిల్‌ రామ్‌చరణ్‌ మగ్గం నేస్తున్న నేత కార్మికుడి పక్కన నిల్చొని కనిపించారు. సమంత ‘రంగస్థలం 1985’లో కథానాయికగా నటిస్తున్నారు. జగపతిబాబు, రంభ, గౌతమి, ఆది పినిశెట్టి, అనసూయ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పూజాహెగ్డే ప్రత్యేక గీతంలో ఆడిపాడనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పంపిణీ చేయనుంది. పల్లెటూరి నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

- Advertisement -