స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు?

15
- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఈ నెల 24వ తేదీ లోపు ఎన్నికల తేదీ ప్రకటించాలి అని సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-E ప్రకారం పంచాయతీల కాల పరిమితి ముగిసిన ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి అని అభిప్రాయపడింది.

తాము బీసీ రిజర్వేషన్ల పట్ల మాత్రమే అభ్యంతరం తెలిపాం…ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు అని వెల్లడించింది. బీసీ రిజర్వేషన్ గ్రామాలను పక్కనపెట్టి మిగతా గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది ఎస్ఈసీ.

అలా విభజించి నిర్వహించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది హైకోర్టు. ఈ నెల 24వ తేదీలోపు ఎన్నికల తేదీ ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Also Read:కేరళలో రష్మికా మైసా!

- Advertisement -