బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 57 రోజులు పూర్తి చేసుకుంది. తాజా వారం నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌లో హీట్ పెంచేయగా ఒకరిపై ఒకరు మాటల దాడి కొనసాగించారు. తొలుత ఈ వారం నామినేషన్స్ ప్రక్రియని కాస్త వెరైటీగా డిజైన్ చేశాడు బిగ్‌బాస్. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.. మీ ముందు కొన్ని బొమ్మలున్నాయి వాటి మీద ఇంటి సభ్యుల ఫొటోలు ఉన్నాయి.. బజర్ మోగిన వెంటనే బొమ్మల్లోని వేరే వాళ్ల ఫొటోలు ఉన్న బొమ్మని తీసుకొని సేఫ్ జోన్‌లోకి ముందుగా పరిగెత్తాలి.. అందరికంటే ఆలస్యంగా ఆఖరిగా చేరుకునే సభ్యులు మరియు వారి దగ్గర ఉన్న బొమ్మ మీద ఎవరి ఫొటో ఉంటే వారిద్దరూ నామినేషన్ జోన్‌లికి వస్తారు.. చివరికి వారిద్దరిలో ఒకరు నేరుగా ఇంటి నుంచి బయటికివెళ్లేందుకు నామినేట్ అవుతారు అని చెప్పారు.
ఫస్ట్ రౌండ్‌లో సంజన అందరికంటే లాస్ట్ వచ్చింది. అయితే వెరైటీగా సంజనకి తన ఫొటో ఉన్న టెడ్డీయే దొరికింది. దీంతో ఇక నుంచి మీ బొమ్మ మీరు తీసుకోకూడదు.. దివ్య ఆమె బొమ్మని ఎవరితో స్వాప్ చేస్తారో చెప్పండి అంటూ బిగ్‌బాస్ అడిగాడు. దీంతో రీతూతో స్వాప్ చేసే అవకాశం ఇచ్చింది దివ్య. ఇద్దరి వాదన విని సంజనని నామినేట్ చేసి రీతూని సేవ్ చేసింది దివ్య.
తర్వాత రెండో రౌండ్ సుమన్ శెట్టి మిగిలిపోగా సుమన్ చేతిలో తనూజ బొమ్మ ఉంది. దీంతో సుమన్ శెట్టి-తనూజ ఇద్దరూ ఒకరితో ఒకరు వాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా రెండో రౌండ్ లో సంజన.. సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఆ తర్వాత రూల్స్ మార్చారు బిగ్ బాస్. మీరు తీసుకునే బొమ్మ మీరు నామినేట్ చేయాలి అనుకునేవారిది అయి ఉండాలని చెప్పినా మీకు ఇంకా అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు రూల్స్ మారుస్తున్నాను.. ఈ రౌండ్‌లో ఆఖరిగా సేఫ్ జోన్‌లోకి చేరిన సభ్యులు వారి దగ్గరున్న బొమ్మ ఎవరిదో ఆ ఇద్దరూ తలా ఒకరిని తగిన కారణాలతో నామినేట్ చేయాలి.. ఆ రెండు నామినేషన్స్ నుంచి ఒకరు నేరుగా నామినేట్ అవుతారు ఈ రౌండ్‌కి దివ్యనే సంచాలకులు అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ముందుగా భరణిని నామినేట్ చేశాడు డీమాన్. సాయి.. తనూజని నామినేట్ చేశాడు.
Also Read:కేరళలో రష్మికా మైసా!
ఇలా చివరికి నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి సంజన,సుమన్ శెట్టి,భరణి,కళ్యాణ్,రాము,సాయి, తనూజ నామినేషన్స్‌లో ఉన్నారు.

