ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‌లో రికార్డు క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన విషయంపై దర్శకదీరుడు రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. జపాన్‌లోని 114కేంద్రాల్లో శత దినోత్సవం చేసుకోంటున్న తొలి భారతీయ చిత్రంగా నిలవనుంది. జపాన్‌లో 42సెంటర్లో ఏక దాటిగా వందరోజులు ఆడుతున్న ఏకైక సినిమాగా నిలిచింది. ఇప్పటివరకూ ముత్తు అరుణాచలం సినిమాలంటే తెగ ఇష్టపడే జపనీయులు తాజాగా ఆర్ఆర్‌ఆర్ సినిమాను ఇష్టపడుతున్నారు.
ఒక సినిమా 100 150 200రోజులు లేదా అంతకు మించి ఆడితే అది చాలా పెద్ద విజయం కానీ ఈ రోజుల్లో ఒక సినిమా నెలరోజులు ఆడిందంటే ఘన విజయంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రజలకు ఆలోచన తీరు మారింది. దానికి తోడు ఆన్‌లైన్ టెక్నాలజీ విపరీతంగా పెరగడం వల్ల సినిమాలను ఎవరూ కూడా థియేటర్‌కు వచ్చి చూడటం మానేశారు. కానీ జపాన్‌లో సినీ ప్రియులు మాకు మళ్లీ ఆరోజుల్ని గుర్తు చేశారు. మేము తిరిగి ఆ ఆనందాన్ని పొందేలా చేశారు.
లవ్‌యూ జపాన్ థ్యాంక్యూ అని రాజమౌళి పేర్కోన్నారు. గతేడాది విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని గతేడాది అక్టోబర్ నెలలో ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులు సొంతం చేసుకుంది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది.
ఇవి కూడా చదవండి…