వరుణ్ ‘వాల్మీకి’లో హైదరాబాదీ అమ్మాయి..!

428
varun valmiki
- Advertisement -

కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన క‌థా చిత్రాలతో మెప్పిస్తున్న హీరో వరుణ్ తేజ్‌. తాజాగా గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్‌ శంకర్‌తో వాల్మీకి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించనుండగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా సెప్టెంబర్‌ 13న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా  ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్ డేట్ వచ్చేసింది.

సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో హైదరాబాదీ అమ్మాయికి అవకాశం ఇచ్చారు. సాధారణంగా ఐటెం సాంగ్‌ అనగానే బాలీవుడ్‌ లేదా విదేశీ భామలు గుర్తుకువస్తారు కానీ అందుకు భిన్నంగా హరీష్‌ మాత్రం హైదరాబాదీ అమ్మాయి డింపుల్‌కి అవకాశం ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు దర్శకుడు హరీష్‌. దేవి 2 సినిమాలో ప్రభుదేవాతో కలిసి కీలకపాత్రలో నటించింది డింపుల్‌.

తమిళంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న జిగర్తాండ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఐనాంక బోస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

- Advertisement -