సంగారెడ్డిలో టెలీమెడిసిన్ సేవలు: మంత్రి హరీష్

393
harish rao
- Advertisement -

సంగారెడ్డి జిల్లాలో టెలి మెడిసిన్ సేవలు ప్రారంభం చేసి వైద్య సదుపాయాలు, మందులు ఇస్తామని….ప్రజలు టెలి మెడిసిన్ సౌకర్యం ను వినియోగించుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు. సంగరెడ్డి జిల్లా అంబెడ్కర్ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని నిరుపేదలైన ఆటో డ్రైవరులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌ …కరోనా వల్ల ఇబ్బందులు పడిన వారిని ఆదుకోవడంలో దేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. వలస కూలీలు, కార్మికులు కోసం ఒక్క 12 కిలోల బియ్యం, 500 సహాయం చేశామన్నారు.

సంగారెడ్డి జిల్లాలో మరో 15 వేల 800 మంది కి వలస కార్మికుల కు ప్రభుత్వం సహాయం చేయబోతోందని….తెలంగాణలోని దాదాపు 4 లక్షల మంది వలస కూలీలకు సహాయం చేశామన్నారు. మరో రెండున్నర లక్షల మందికి ఇస్తాము.నెలాఖరు వరకు అందరు ఇండ్లకే పరిమితము కావాలన్నారు.

- Advertisement -