- Advertisement -
కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆర్ఎంసీ సిఫారసుల ముసాయిదాపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ అభిప్రాయాలను ముసాయిదాలో పొందుపర్చలేదని అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్యుడు ఆర్ఎంసీ కన్వీనర్‌కు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. ముసాయిదా నివేదికలో ఏపీ అభిప్రాయాలను పొందుపరిచి తెలంగాణ అభిప్రాయాలు పక్కన పెట్టడం సబబు కాదన్నారు. తెలంగాణ ప్రతిపాదనలను కేఆర్ఎంబీ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ రూల్ కర్వ్స్ వరద జలాల వినియోగానికి సంబంధించి తమ అభిప్రాయాలు పొందుపరచలేదని లేఖలో పేర్కొన్నారు. ఆర్ఎంసీ ఐదో సమావేశానికి ముందే తమ అభిప్రాయాలను పొందుపరచాలని తెలిపారు. ముసాయిదాలో మార్పులు చేయాలని ఈఎన్సీ లేఖలో కోరారు.
- Advertisement -