బాలయ్య స్పెషల్‌ ఫోటో షేర్‌ చేసిన గోపీచంద్‌

97
balaiah
- Advertisement -

నందమూరి బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 48 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోపీచంద్‌ స్పెషల్‌ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. బాలకృష్ణ అఖండతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. శృతిహాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా సెట్స్‌ నుంచి ఓ స్పెషల్‌ ఫోటోను వదిలారు డైరెక్టర్‌ మలినేని. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈసినిమాలో కోలీవుడ్ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

- Advertisement -