తెలంగాణ పథకాలు దేశమంతా: సీఎం కేసీఆర్

21
- Advertisement -

తెలంగాణ పథకాలు దేశమంతా అమల్లోకి రావల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. నాందేడ్‌లో జరిగిన బీఆర్ఎస్ సభలో మాట్లాడిన సీఎం…మేకిన్‌ ఇండియా జోకిన్‌ ఇండియాగా మారిందన్నారు. 54 సంవత్సరాలు దేశాన్ని కాంగ్రెస్‌, 16 సంవత్సరాలు బీజేపీ పార్టీలు పాలించాయని, రెండు పార్టీలు ఏం సాధించాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలు పరస్పరం అవినీతి ఆలోచనలు చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు.

తెలంగాణ‌లో వ‌చ్చినా మార్పు దేశ‌మంతా రావాల్సి ఉంద‌ని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రైతు సర్కార్ వ‌స్తేనే దేశంలో మార్పు వ‌స్తుంది. బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తే రెండేండ్ల‌లోనే మహారాష్ట్ర‌లో 24 గంట‌ల విద్యుత్ ఇస్తాం అని కేసీఆర్ తేల్చిచెప్పారు.

ఇంత విశాల భార‌త్‌లో క‌నీసం 2 వేల టీఎంసీల రిజ‌ర్వాయ‌ర్ ఎందుకు లేదు? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. దేశంలో రిజ‌ర్వాయ‌ర్లు కాదు.. జ‌ల వివాదాలు, ట్రిబ్యున‌ళ్లు పెరిగిపోయాయి. కేంద్రం ట్రిబ్యున‌ళ్లు వేసి చేతులు దులుపుకుంటుందన్నారు. చిత్త‌శుద్ధితో కృషి చేస్తే దేశంలో ప్ర‌తి ఎక‌రాకు నీళ్లు ఇవ్వొచ్చు. గ‌ట్టిగా అనుకుంటే ప్ర‌తి ఇంటికి స్వ‌చ్ఛ‌మైన తాగునీరు ఇవ్వొచ్చు. 8 ఏండ్ల క్రితం తెలంగాణ‌లోనూ ఎన్నో స‌మ‌స్య‌లు ఉండేవి. కొన్నేండ్ల క్రితం తెలంగాణ‌లో సాగు, తాగునీరు, విద్యుత్ కొర‌త ఉండేది. తెలంగాణలో క్ర‌మంగా అన్ని స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించాం అన్నారు.

నువ్వు అంత తిన్నావంటే.. నువ్వు ఇంత తిన్నావంటూ కాంగ్రెస్‌, బీజేపీ తిట్టుకుంటున్నాయని విమర్శించారు. ఈ వెనుకబాటు తనానికి ఈ రెండు పార్టీలే కారణం. ఒకరు అంబానీ అంటే మరొకరు ఆదానీ అంటారని ఆరోపించారు. ప్రధాని మన్‌కీ భారత్‌ పేరుతో ప్రజలను వంచిస్తున్నారని, ఇది రాజకీయం కాదు.. ఇది జీవన్మరణ సమస్య అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -