- Advertisement -
కొద్దిరోజులుగా తీవ్ర చలితో వణికిపోయిన ప్రజలకు కాసింత రిలీఫ్ దొరికింది.రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. రానున్న రెండు రోజులు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంక పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నదని తెలిపింది. శుక్రవారం రాష్ర్టంలోని ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడినట్టు వెల్లడించింది. శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 21.3 డిగ్రీలుగా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
పలు జిల్లాల్లో ఉదయం పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని, రాష్ర్టానికి ప్రధానంగా ఆగ్నేయదిశ నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరో వైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు రోజులుగా చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది.
- Advertisement -