ఉపాధి కూలీలు కాదు ఉపాధి శ్రామికులు!

16
- Advertisement -

శ్రామికులే లేకపోతే దేశ నిర్మాణం లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. మేడే సందర్భంగా శ్రామికులతో పవన్‌కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడు గొప్ప వాడే … ఇకపై ఉపాధి కూలీలను ఉపాధి శ్రామికులు అని పిలుస్తాం అన్నారు.

నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి నాకు ఏ ఉద్యోగం చేయాలో అర్ధం అయ్యేది కాదు అన్నారు పవన్ కళ్యాణ్. నాకు చెమట చిందించి పనిచేయడం ఇష్టం… చిన్నప్పుడు బెంగళూరులో ఒక నర్సరీలో పని చేయడం కోసం వెళ్తుంటే మావాళ్లు నన్ను ఆపారు అన్నారు. కేవలం ఒక డాక్టర్, ఇంజనీర్, సైంటిస్టులు మాత్రమే గొప్ప వాళ్ళు కాదు అన్నారు.

పాతికేళ్ల క్రితం 8 ఎకరాలు కొనుక్కున్నా.. కండ కరిగించే వాళ్లు లేకపోతే గ్రీన్ రివల్యూషన్స్ రావు అన్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా అవసరం అన్నారు. ఓట్ల కోసం తాను ఏ పని చేయడం లేదని… మూగ జీవాలకు చేస్తే ఓటు వేయ్యవన్నారు. ఉపాధి శ్రామికుల సంక్షేమం మాకు చాలా ప్రాధాన్యం అన్నారు. ఉపాధి శ్రామికులు ఎండాకాలం ఉదయం 11లోపు పూర్తి చేయాలన్నారు.

Also Read:Raid 2: వసూళ్లు అదరిపోవాలంతే!

- Advertisement -