- Advertisement -
పశ్చిమబెంగాల్ మరియు ఉత్తర ఒరిస్సా తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.
ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి దక్షిణ తమిళనాడు వరకు 0.9 km ఎత్తు వరకు కొనసాగుతోంది.ఈరోజు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
- Advertisement -