రెండు రోజుల్లో రాష్ట్రానికి నైరుతి..

27
rains

నైరుతి రుతుపవనాలు రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాలు శుక్రవారం కేరళ అంతటా విస్తరించాయని…తమిళనాడు,కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొంతభాగంలోకి ప్రవేశించాయన్నారు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న.

రానున్న 2-3 రోజుల్లో తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు, కర్ణాటక, తమిళనాడు, లక్షద్వీ్‌పలోని మిగిలిన అన్ని ప్రాంతాలకు, మహారాష్ట్ర, గోవా, మధ్య అరేబియా సముద్రం, ఈశాన్య, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించారు. రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఇక మరోవైపు నైరుతి రుతుపవనాల రాకకు ముందే రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలోని పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.