అందరిచూపు…టీఆర్ఎస్ మేనిఫెస్టో వైపే

302
kcr trs
- Advertisement -

ఓ వైపు తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకోగా ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇక ఎన్నికల ప్రచారంలో ముందున్న టీఆర్ఎస్..మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్దమైంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్‌లో ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ వివరాలను వెల్లడించనున్నారు.

పింఛన్ల పెంపు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ వ్యయం పెంపు,పంట రుణ మాఫీ,నిరుద్యోగ భృతి వంటి అంశాలపై వరాల జల్లు కురిపించారు. మరోసారి సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు వ్యవసాయం,పరిశ్రమలు-ఆర్ధికాభివృద్ధి వంటి అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావించనున్నారు.

Image result for టీఆర్ఎస్ మేనిఫెస్టోకేశవరావు కమిటీకి ఇప్పటికే పలు సంఘాలు,సంస్థల నుంచి పలు సూచనలొచ్చాయి. దసరా తర్వాత పూర్తిస్థాయి ప్రణాళికను విడుదల చేయాలని భావించారు. ఇవాళ పాక్షిక ప్రణాళిక విడుదల చేసి దసరా తర్వాత పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

పింఛన్ల పెంపుతో పాటుకొత్తగా సొంత ఇళ్లనిర్మాణ పథకాన్ని సీఎం ప్రకటించనున్నారని సమాచారం. ఎవరికైనా సొంత స్థలం ఉండి, డబుల్ బెడ్‌ రూమ్‌ ఇంటిని నిర్మించుకుంటే దానికి అయ్యే నిర్మాణ వ్యయాన్ని చెల్లిస్తామని మేనిఫెస్టోలో ప్రతిపాదించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పన వంటి అంశాలపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తంగా సీఎం కేసీఆర్ ప్రకటించే మేనిఫెస్టోపైనే అందరి చూపు ఉంది.

- Advertisement -