ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణ నెం 1

240
- Advertisement -

పారిశ్రామికరంగంలో తెలంగాణ దూసుకుపోతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 98.78 స్కోరుతో తెలంగాణ దేశంలోనే మొదటి స్ధానంలో నిలిచింది. ర్యాంకులను కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ విడుదల చేసింది. రెండోస్ధానంలో గుజరాత్..మూడో స్ధానంలో ఛత్తీస్‌గఢ్‌ నిలిచింది. గతేడాది 13వ స్ధానంలో నిలిచిన తెలంగాణ…ఈ ఏడాది 12 స్థానాలు మెరుగుపరుచుకుని అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇదిఇలా ఉండగా టీఎస్‌ఐపాస్‌ ద్వారా దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోనే టీఎస్ ఐపాస్ ప్రత్యేకతను సంతరిచుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 15 నెలల స్వల్ప వ్యవధిలో రాష్ర్టానికి 44,539 కోట్ల పెట్టుబడులు సాధించింది. టీఎస్ ఐపాస్ ద్వారా ఎనిమిది విడతల్లో 2533 పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.

kcr

సీఎం కేసీఆర్ పాలనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో దేశంలో మోస్ట్ పాపులర్ సీఎంగా కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఎంపికయ్యారు. ఈ సర్వేలో 87 శాతం రేటింగ్‌తో సీఎం కేసీఆర్ మళ్లీ ఆగ్రస్థానంలో నిలిచారు. ప్రత్యక్షంగా ప్రజలకు చేరే వివిధ రకాల పింఛన్లు, రేషను బియ్యం, ఆరోగ్యశ్రీ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు తదితర పథకాల కారణంగానే కేసీఆర్‌కు జనం పట్టం కట్టినట్లుగా స్పష్టమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. దూరదృష్టితో చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, నిరంతర విద్యుత్ సరఫరా తదితర ప్రాజెక్టులు కూడా ప్రజల మీద సానుకూల ప్రభావం చూపినట్లుగా సర్వే వెల్లడిస్తున్నది.

TSIPASS

ఇక తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో తెలంగాణ అగ్రస్ధానంలో నిలవడంతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వెల్లువలా వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రాంతంగా కేంద్రం ప్రకటించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -