Komatireddy:ఏవియేషన్ హబ్‌గా తెలంగాణ

18
- Advertisement -

హైదరాబాద్ నుంచి యూఎస్ఏ కి నేరుగా విమానాలు నడపాలని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ను కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

అతి పెద్ద సివిల్ ఏవియేషన్ ఎయిర్ షో వింగ్స్ ఇండియా-2024 (WINGS INDIA 2024) మరియు గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ 2024 (Global Aviation Summit-2024)ని నిర్వహించే అవకాశాన్ని హైదరాబాద్‌కు అందించినందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం & ఫిక్కి (FICCI-Federation of Indian Chambers of Commerce & Industry)కి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీశాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

దేశంలోని ఏవియేషన్ మరియు ఏరోస్పేస్ రంగానికి ఉత్సాహవంతమైన వాతవరణం ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని, రాజధాని హైదరాబాద్‌ను ఏవియేషన్ పరిశ్రమకు ప్రదర్శించడానికి ఈ రెండు ఈవెంట్‌లు మనకు గొప్ప అవకాశం.

• మనందరికీ తెలుసు, భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ

• ప్రపంచ బ్యాంకు సులభతర వ్యాపార నిర్వహణ (Ease of Doing Business)లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.

• ప్రపంచంలో క్వాలిటీలైఫ్ కు అనువైన నగరాలకు ర్యాంకింగ్స్ ఇచ్చే మెర్సర్ సంస్థ నివేదిక హైదరాబాద్ నగరాన్ని ‘భారతదేశంలో అత్యంత నివసించదగిన నగరం’పేర్కొన్న విషయం మనందరికి తెలుసు.

• ఏడాది పొడవునా అత్యుత్తమ మౌలిక సదుపాయాలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులో ఉండే కాస్మోపాలిటన్ నగరం మన హైదరాబాద్.

రాష్ట్ర పాలసీ

• ఏవియేషన్ మరియు ఏరోస్పేస్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్య రంగం.

• 2018, 2020 మరియు 2022 సంవత్సరంలో నిర్వహించిన వింగ్స్ ఇండియా ఈవెంట్స్ లో ఎవియేషన్ రంగంలో అత్యంత ప్రగతిశీల దృక్పథం కలిగిన రాష్ట్రంగా “ఉత్తమ రాష్ట్ర అవార్డు”ను గెలుచుకుంది.

• ATF (Aviation Turbine Fuel ) పై VATని 16% నుండి 1% వరకు తగ్గించిన మొదటి రాష్ట్రం తెలంగాణ ఉంది.

• హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలకడగా “అత్యుత్తమ విమానశ్రయంగా” అవార్డును అందుకుంటుంది. ఈ మధ్యనే విమానాశ్రయాన్ని 1 లక్ష 20 వేల విస్తీర్ణం నుండి 3 లక్షల 80 వేల విస్తీర్ణంగా విస్తరించాం. ఈ విమానాశ్రయం సంవత్సరానికి 40 మిలియన్ల ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చుతుంది.

కొత్త విమానాశ్రయాలు మరియు హెలిపోర్ట్‌ లు

• “భారతదేశాన్ని ప్రపంచానికి అనుసంధానిద్దాం” అనే “అమృత్ కాల్‌” లక్ష్యానికి అనుగుణంగా.. తెలంగాణ రాష్ట్రం పాత ఎయిర్ పోర్టులను పునరుద్ధరించడం మరియు కొత్త ఎయిర్ పోర్టులను (గ్రీన్-ఫీల్డ్ విమానాశ్రయాలను) ప్రారంభించడం మరియు మన రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి హెలిపోర్ట్‌ ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

• రాష్ట్రంలో మూడు “గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు” మరియు మూడు “బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాల” పునరుద్ధరణపై తీవ్ర కసరత్తులు చేస్తుంది.

ఎ. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు
1. భద్రాద్రి కొత్తగూడెం
2. జకరన్‌పల్లి. నిజామాబాద్ జిల్లా
3. గుడిబండ గ్రామం, అడక్కల్ మండలం, మహబూబ్ నగర్

B. బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు
1) మమూనూర్ గ్రామం, వరంగల్ అర్బన్ జిల్లా
2) బసంత్‌నగర్, పెద్దపల్లి జిల్లా
3) ఆదిలాబాద్ జిల్లా

*మొదటి దశలో మేము ఇప్పటికే వరంగల్ (మమునూర్) విమానాశ్రయం మరియు ఆదిలాబాద్ విమానాశ్రయం పనులను ప్రారంభించాము.
Airports Authority of India (AAI) ఈ ఆరు విమానాశ్రయాల యొక్క సాంకేతిక-సాధ్యాసాధ్యాలపై తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉంది.

సముద్ర విమానాలు :
రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ డ్యామ్‌లో వాటర్ ఏరోడ్రోమ్‌ ఏర్పాటుకు ప్రతిపాదించింది. దీనికి AAI ప్రీ-ఫీజిబిలిటీ నివేదిక కూడా ఇచ్చింది. ఇదే కాదు మరికొన్నిచోట్ల కూడా వాటర్ ఏరోడ్రోమ్‌లను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తుంది.

హెలిప్యాడ్‌లు
తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాలను అనుసంధానించడంలో అగ్రగామిగా ఉంది మరియు తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టరేట్ సముదాయాల వద్ద శాశ్వత హెలిప్యాడ్‌ల సౌకర్యాలున్నాయి. ఈ విధమైన సౌకర్యాలున్న మొదటి రాష్ట్రం తెలంగాణ.

హెలి-టూరిజం
తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు తెలంగాణ ప్రభుత్వం పర్యాటక శాఖ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో విజయవంతంగా జాయ్ రైడ్‌లను నిర్వహిస్తోంది. ఇటీవల హైదరాబాద్ నగరంతో పాటు, వేములవాడలో జాయ్ రైడ్ లను నిర్వహించింది. అంతేకాదు మేడారం జాతర (ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర) కోసం ములుగు జిల్లాలో జాయ్ రైడ్‌లను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది.

ఎయిర్ అంబులెన్స్:
అధునాతన వైద్య సౌకర్యాల కలిగి, వైద్య సేవల కోసం అత్యధికులు కోరుకునే నగరం హైదరాబాద్. దేశంలోని దాదాపు 50% ఎయిర్ అంబులెన్స్ సేవలు హైదరాబాద్ కి నగరంలోని అత్యంత అధునాతన ఆసుపత్రులకు రోగులను తరలించే సేవలు అందిస్తున్నాయి.

FTO (ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్)
• తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ కమర్షియల్ పైలట్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్‌లకు MSc ఏవియేషన్ కోర్సును అందిస్తుంది అంతేకాదు డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇస్తుంది.
• ఈ సంస్థ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీగా రూపాంతరం చెందినప్పటి నుండి ఇప్పటి వరకు 135 మంది కమర్షియల్ పైలట్‌లకు శిక్షణ ఇచ్చాము మరియు అందరూ వివిధ విమానయాన సంస్థలలో పనిచేస్తున్నారు
• ఈ సంస్థ ద్వారా 430 మంది డ్రోన్ పైలట్‌లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అంతేకాదు లైసెన్సులు/సర్టిఫికెట్‌లను జారీ చేసాము మరియు వీరిలో అత్యధికులు పైలెట్లుగా ఉద్యోగాల్లో స్ధిరపడ్డారు.
• 630 మంది పూర్వ విద్యార్థులు AME & M.Sc ఏవియేషన్ కోర్సులకు అర్హత సాధించారు. వీరిలో చాలా మంది విద్యార్ధులు డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. వీరంతా ఉపాధి పొందుతున్నారు.
• TSAA సంస్థ గత 5 సంవత్సరాలుగా ఎయిరో క్లబ్ ఆఫ్ ఇండియా,పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తమ ఎవియేషన్ అకాడమీగా అవార్డును అందుకుంటున్నది.

MRO (Maintenance Repair and Overhaul)

• MRO పెట్టుబడులు పెట్టేందుకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఇది రాష్ట్రంలో భారీ ఉద్యోగ కల్పనకు తోడ్పడుతుందని భావిస్తున్నాం.
• రాష్ట్రం ప్రభుత్వం GMR మరియు ఎయిర్ ఇండియా సంస్థలతో కలిసి రెండు MROలను నిర్వహిస్తున్నది.
• ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణలో ఉన్న మౌళిక వసతులు, నైపుణ్యం కలిగిన MRO మానవ వనరులు ఇతర అనుకూలమైన వాతావరణం గురించి.. ప్రభుత్వం కొన్ని OEM( “Original Equipment Manufacturer”) మరియు ఆపరేటర్‌లతో చర్చలు జరుపుతుంది.

డ్రోన్లు

• డ్రోన్ మరియు UAV పరిశ్రమ ల అభివృద్ధి కోసం.. డ్రోన్ పాలసీ రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. హెల్త్‌ కేర్, అగ్రికల్చర్, మైనింగ్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వంటి రంగాల్లో డ్రోన్ వినియోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌లు మరియు పరిశ్రమ భాగస్వాములతో చర్చిస్తుంది.

• వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం “మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్ట్‌”ను ప్రారంభించింది, ఇందులో డ్రోన్‌లను మెడిసిన్ మరియు ఆర్గాన్ డెలివరీ కోసం ఉపయోగిస్తారు.
• “మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్ట్‌”లో భాగంగా వికారాబాద్ లో భారతదేశంలో మొట్టమొదటి సారిగా BVLOS డ్రోన్‌ విమానం మందులు అందించేందుకు సహకరించిన గౌరవనీయ పౌర విమానయాన మంత్రికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
ఏరోస్పేస్ & డిఫెన్స్

• తెలంగాణ రాష్ట్రానికి ఏరోస్పేస్, డిఫెన్స్ మరియు స్పేస్ పరిశ్రమలు అత్యంత ప్రాధాన్య రంగాలు. తయారీ, సేవలు, ఇంజనీరింగ్, ట్రైనింగ్ తో పాటు అనుబంధ సంస్థలకు ఆతిథ్యం ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మరియు TSIIC అనేక ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేసింది.
• తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన “రాష్ట్ర పారిశ్రామిక విధానం” TS iPASS అనేది పరిశ్రమలకు అత్యంత అనుకూలమైన పాలసీగా ప్రశంసలు అందుకుంది. ఇది మెగా ప్రాజెక్ట్ ల స్థాపనకు, నిర్వహణకు ఎంతో అనుకూలమైనది.
• ఇప్పటికే రాష్ట్రంలో లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, GE ఏవియేషన్, ఎయిర్‌బస్, సాఫ్రాన్ ఎల్బిట్ మొదలైన ప్రముఖ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMలు) తెలంగాణలో తమ సంస్థలను స్థాపించారు.
• సఫ్రాన్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఇంజన్ MRO కంపెనినీ హైదరాబాద్ లోఏర్పాటు చేస్తున్నటు ప్రకటించింది.ఈ కార్యక్రమంలో సెంట్రల్ సివిల్ ఏవియేషన్ & స్టీల్ మినిష్టర్ శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ జనరల్ డా. వి.కె. సింగ్, శ్రీ రేమి మైల్లర్డ్, తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ వి ఎన్ భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read:KTR:పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ

- Advertisement -