కోమటిరెడ్డిపై కడియం ఫైర్..సభ నుండి వాకౌట్

12
- Advertisement -

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చర్చ సందర్భంగా బీఆర్ఎస్ – కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బడ్జెట్‌పై మాట్లాడిన కడియం శ్రీహరి..సభలో పెట్టిన అంకెలు అన్ని తప్పేనన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన చీడ పురుగు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని…అసలు కాంగ్రెస్‌ పార్టీని నాశనం చేసిందే రాజగోపాల్‌ రెడ్డి అని విమర్శించారు. శాసనసభలో మఖ్యమంత్రి భాష అభ్యం తరకరంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుండి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్‌ 9న రైతు రుణమాఫీ చేస్తామన్నారు కానీ చేయలేదన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారని కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పరిశీలిస్తే అమలు అయ్యే సూచనలే లేవన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలకు ఏడాదికి 1.36 లక్షల కోట్లు అవసరం కానీ బడ్జెట్‌లో ఎంత పెట్టారో ఆలోచించాలన్నారు.

నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని బడ్జెట్‌లో చెప్పారు..4.16 లక్షల ఇళ్లకు రూ.24 వేల కోట్లు అవసరం అవుతుందని చెప్పారు. అయితే బడ్జెట్‌లో కేవలం రూ.7వేల కోట్లే కేటాయించారని విమర్శించారు.

Also Read:ట్రెండింగ్‌లో మమ్ముట్టి.. ‘భ్రమయుగం’

- Advertisement -