ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. విస్తరణ తర్వాత తొలిసారిగా ప్రగతి భవన్లో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీలో రేపు సమర్పించనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిమాండ్లకు అనుబంధ గ్రాంట్లకు ఆమోదం తెలిపింది. వార్షిక బడ్జెట్‌తో పాటు అనుబంధ గ్రాంట్లను సభలో ప్రవేశపెట్టనున్నారు. గతంలో జీఎస్టీ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆర్డినెన్స్ స్థానంలో బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 22న ఉదయం 11.30గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్, మండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
(ప్రమాణ స్వీకారానికి హరీష్‌రావు ఎలా వచ్చాడో చూడండి..https://goo.gl/AyWJva)