దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ గిడ్డంగుల సంస్థ..

754
Mandula Samuel
- Advertisement -

సీఎం కేసీఆర్ ముందు చూపుతో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థగా మారింది. తెలంగాన రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామెల్ నేడు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని గోదాం లలో సిసి రోడ్స్ నిర్మాణం చేపడుతున్నాము. గోదాంలలో పనిచేసే 30 వేల మంది హమాలీలకు ఆరోగ్య భీమా ,పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని ఆయన అన్నారు.

మహబూబాబాద్ జిల్లాలో ఆధునిక 5 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల కోల్డ్ స్టోరేజ్ నిర్మాణంకు ప్రణాళికలు వేస్తున్నాము. నల్గొండ జిల్లాలో ఆధునిక హంగులతో నూతన గోదాంల నిర్మాణం చేపట్టబోతున్నామని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామెల్ పేర్కొన్నారు.ఈనెల ఎనిమిదో తేదీన తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ బోర్డ్ మీటింగ్ వికారాబాద్ జిల్లాలో నిర్వహించనున్నామన్నారు.

రాష్ట్రంలోని అన్ని గోదాంల పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున హరితహారం నిర్వహించనున్నామని మందుల సామెల్‌ తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల వినియోగం ద్వారా ఉత్పత్తి అయ్యే ధాన్యం నిలువలకు అనుగుణంగా గోదాంల నిర్మణం చేపడుతామని..50 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యాన్ని చేరుకోవడమే మా సంస్థ లక్ష్యంగా ముందుకి వెళ్తామని ఆయన అన్నారు. ఇక గోదాంలలో ఉద్యోగుల భర్తీ కోసం సీఎం కేసీఆర్,వ్యవసాయ శాఖకి విజ్ఞప్తి చేయడం జరిగిందని సామెల్‌ తెలిపారు.

- Advertisement -