తెలంగాణ రాష్ట్రంలో 100% గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పైప్డ్ డ్రింకింగ్ వాటర్ అందుతుందని తెలిపింది కేంద్రం. దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు ఎంత శాతం పైప్డ్ డ్రింకింగ్ వాటర్ అందుతోందో తెలపాలని రాజ్యసభలో సభ్యుడు ప్రసన్న కుమార్ ఆచార్య అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు కేంద్ర జల్ శక్తి శాఖ సహాయమంత్రి రతన్ లాల్ కటారియా.
దేశ వ్యాప్తంగా 67.49% గ్రామీణ ప్రజలకు పైప్డ్ డ్రింకింగ్ వాటర్ అందుతున్నట్లు తెలిపింది కేంద్రం. 2024 సంవత్సరం వరకు జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీరు అందించాలని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్లకు పైగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి పైప్డ్ డ్రింకింగ్ వాటర్ అందిస్తున్నట్లు వెల్లడించారు. గోవా, అండమాన్ & నికోబార్ లో కూడా 100% గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పైప్డ్ డ్రింకింగ్ వాటర్ అందుతుందని..గుజరాత్ లో 97% పైగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పైప్డ్ డ్రింకింగ్ వాటర్ అందుతుందన్నారు.