మరోకరికి కరోనా.. చిలుకూరి టెంపుల్‌ మూసివేత..

383
corona
- Advertisement -

భారత్‌లో కరోనా పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 137కు చేరింది. దీనితో దాదాపు సగం రాష్ట్రాలు బంద్ పాటిస్తున్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాలు కూడా అదే బాట పట్టేలా కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 5 కేసులు నమోదు కాగా.. తాజాగా మరో కరోనా కేసు నమోదైంది.

బ్రిటన్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఇక కరోనా ప్రభావంతో ఇప్పటికే హైదరాబాద్‌లో సినిమా హాల్లు,స్టేడియాలు,పార్కులు, జనాలు రద్దీగా ఉండే హోటల్లు మూతపడ్డాయి.

ఈ నేపథ్యంలో నగర శివార్లలో ఉన్న ప్రముఖ దేవాలయం చిలుకూరు బాలాజీ ఆలయం రేపటి నుంచి మూత పడనుంది. మార్చి 19 నుంచి 25వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రకటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు దేవాలయాలు ముతపడ్డాయి.

- Advertisement -