మిస్డ్ కాల్ ఇస్తే మీ ఇంటి వద్దకే పండ్లు..

450
minister niranjan reddy
- Advertisement -

హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్‌ నడుస్తున్న నేపథ్యంలో ప్రజలు బయటికి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో వాక్ ఫర్ వాటర్ సంస్థ ప్రజలకు కావల్సిన పండ్లను ఇంటివద్దకే అందింస్తోంది. 88753 51555 నంబర్‌కి ఒక్క మిస్‌డ్‌ కాల్ ఇస్తే ఇంటివద్దకే పండ్లు వస్తాయి.. అయితే వాక్ ఫర్ వాటర్ సంస్థ తలపెట్టిన ఈ ప్రయత్నాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వాక్ ఫర్ వాటర్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వ ఫామ్ టు హోం సేవలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 30 వేల కుటుంబాలకు తాజా పండ్లు సరఫరా చేసింది. దీనికి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. 88753 51555 నంబర్‌కి ఒక్క మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వండి. రూ.300 కు ప్రజల ఇంటి వద్దకే మామిడి (1.5 కేజీ), బొప్పాయి ‍(3 కేజీలు), నిమ్మ(12కాయలు), పుచ్చ(3 కేజీలు), బత్తాయి(2 కేజీలు), సపోట(1 కేజీ) పండ్ల డెలివరీ పొందవచ్చన్నారు మంత్రి.

పై నంబర్‌కి మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వగానే… SMS రూపంలో ఆర్డర్‌ నమోదు పత్రం వస్తుంది. అందులో కావాల్సిన పండ్ల పరిమాణం, చిరునామా నింపితే… 78 గంటల్లోగా ఇంటి వద్దకే పంపిణీ చేస్తారు. రైతులుగా రైతుల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి , నాకూ తెలుసు అన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. కరోనా మూలంగా లాక్ డౌన్ తో చేతికి వచ్చిన రైతుల పండ్లు తోటల్లోనే మగ్గిపోతున్న పరిస్థితులు వస్తాయంటేనే బాధగా ఉంది. ప్రజలు ఖరీదు చేసే ప్రతి పండూ రైతులకు అండగా నిలవటంలో భాగమే అన్నారు.

ఈ విపత్కర పరిస్థితులలో రైతులకు – వినియోగదారులకు వారధిగా నిలుస్తున్న వాక్ ఫర్ వాటర్ వ్యవస్థాపకులు కరుణాకర్ రెడ్డిని అభినందించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. దాతలు ముందుకు వచ్చి ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే వారి తరపున ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, అనాధాశ్రమాలు, వృద్దాశ్రమాలలో సంస్థ తరపున పండ్లు అందజేస్తామన్నారు. పెద్దమనసు చేసుకోండి .. దాతలు ముందుకు రండి .. మన రైతులకు అండగా నిలవండని పిలుపునిచ్చారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

- Advertisement -