మరో నోటిఫికేషన్…3,897 గ్రీన్ సిగ్నల్‌

181
- Advertisement -

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర మెడికల్ కాలేజీల్లో 3, 897 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్రంలోని తొమ్మిది వైద్య కళాశాలలు వాటి అనుబంధ ఆసుపత్రులకు పోస్టులను మంజూరు చేసింది. ఓకే రకమైన కేటగిరీలో భర్తీ కాకుండా వివిధ కేటగిరీల్లో భర్తీ చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జనగామ, నిర్మల్‌లోని మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లకు ఈ పోస్టులను మంజూరు చేసింది. వీటిలో ఒక్కో కాలేజీకి 433 పోస్టులను కేటాయించింది.

వైద్య కళాశాలలకు పోస్టులు మంజూరు చేయడం పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆరోగ్య తెలంగాణ దిశగా మరో కీలక ముందడుగు పడిందని అన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆదిశగా చర్యలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

 

ఇవి కూడా చదవండి…

జైల్లో పెడతారా..దేనికైనా సిద్ధం: కవిత

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదా?

బీజేపీ వదిలిన బాణం..కవిత సెటైర్

- Advertisement -